మెదక్ : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం.పద్మ దేవేందర్ రెడ్డి. ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ కోదండ రామాలయంలో స్వామివారి పల్లకి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మెదక్ జిల్లా ప్రజలందరికి వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు ప్రజాప్రతినిధులకు మంచి ఆలోచనలు కలిగి ప్రజలకు మంచి సేవ చేయాలని ప్రజలకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఆర్కే శ్రీనివాస్, పట్టణ పార్టీ కో కన్వీనర్లు గడ్డమీది కృష్ణ గౌడ్, లింగ రెడ్డి,మాజీ కౌన్సిలర్ మాయ. మల్లేశం హవెలిఘనపూర్ మండలం మాజీ జెడ్పిటిసి సుజాత శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి నాయకులు ప్రభు రెడ్డి,సంతోష్, శంకర్, మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.