అగ్ని ప్రమాదంలో ఆర్టీఏ సీజ్ చేసిన వాహనాలు దగ్ధం
మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది
నర్సాపూర్ జనవరి 9 (సిరి న్యూస్) : గతంలో ఆర్టీఏ సీజ్ చేసిన వాహనాలను చాలాకాలంగా నర్సాపూర్ ఆర్టీసీ బస్ డిపో ప్రాంగణంలో పార్కింగ్ చేసి ఉంచగా సీజ్ చేసిన వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 4 టాటా ఏసీ ఆటోలు, ఒక కారు దగ్ధమయ్యాయి .దట్టమైన పొగ రావడంతో గమనించిన ఆర్టీసీ డిపో సిబ్బంది ఇతర వాహనాలకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్త పడి ఒక స్కూల్ బస్సు ను ఇతర బస్సులను దూరంగా తీసుకెళ్లి పార్కింగ్ చేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో సిబ్బంది ఒక్కసారిగా ఊపిరి పీల్చు కున్నారు. చెలరేగిన మంటల గురించి డిపో అధికారులకు వివరణ అడగక అనుకోకుండా మంటలు ఏ విధంగా మంటలు వచ్చాయి మాకు కూడా తెలియదని సమాధానం ఇచ్చారు పై అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.