పట్టించుకోని పంచాయతీ సెక్రెటరీ ఫోన్ చేసిన అందుబాటులోకి రాని పంచాయతీ సెక్రెటరీ.
మధుసూదన్ కులగూర్ గ్రామస్తుడు…. ఫిర్యాదుదారుడు..
సంగారెడ్డి: కులగూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బ్యాగరి నర్సింలు చెట్లను నరికి వేయడంతో స్థానికులు తో పాటు మధుసూదన్, అడ్డుకున్నారు. మమ్మల్ని అడ్డుకుంటావా అని హెచ్చరిస్తూ వారిపై దాడికి దిగారు. భయభ్రాంతులకు గురి అయిన మధుసూదన్ స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎవరిఅనుమతి లేకుండా చెట్లను నరికి వేయడం కరెక్టుగా కాదనిమధుసూదన్ బ్యాగరి నర్సింలు మధ్య వాగ్వాదం జరిగింది. విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో పోలీసు వారు విచారణ చేస్తున్నారు. ఈ విషయంపైపంచాయతీ సెక్రటరీ సంప్రదించగా అందుబాటులోకి రాకపోవడంతో నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
ఉపాధి హామీకి సంబంధించిన చెట్లను సరైన పద్ధతి కాదని అధికారుల అనుమతి తీసుకుని చెట్లను నరికి వేయాలని స్థానికులకు అవన్నీ లెక్క చేయకుండా నేనెవరో నా బ్యాగ్రౌండ్ ఏందో తెలియక మీరు మాట్లాడుతున్నారు జాగ్రత్త అంటూ బ్యాగరి నరసింహులు చెందిన కొందరు మధుసూదన్ హెచ్చరించారు.
ఈ విషయంపై వెంటనే అధికారులు చర్య తీసుకుని ఇరువురిని పిలిపించి సమస్య పరిష్కరించి న్యాయం చేయాలని వారు కోరారు. సుమారుగా చెట్ల విలువ రెండున్నర నుంచి మూడు లక్షల వరకు ఉంటుందని, మధుసూదన్ తెలిపారు. 4 ట్రాక్టర్లు చెట్లు కొట్టినవి అమ్ముకోవడంతో, ఒక ట్రాక్టర్లు మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు తీసుకెళ్లడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ ను జిల్లా ఎస్పీని కలిసి గ్రామస్తుల తరఫున ఫిర్యాదు చేస్తామని ఇప్పటికే పోలీస్ ఫిర్యాదు చేశామని మధుసూదన్ పేర్కొన్నారు.