కొడుకును చంపిన తండ్రి అరెస్టు, రిమాండ్
మనోహరాబాద్, జనవరి 17. సిరి న్యూస్
కొడుకును చంపిన తండ్రిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తూప్రాన్ సీఐ రంగకృష్ణ, మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ లు తెలిపారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో మాదాసు శ్రీకాంత్ 29 ప్రతిరోజు తప్ప తాగి వచ్చి తల్లిదండ్రులను వేధిస్తుండేవాడని తెలిపారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం నుండి రాత్రి వరకు శ్రీకాంత్ తాగి వచ్చి తండ్రితో గొడవ పడుతూ చంపేస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలో రాత్రి శ్రీకాంత్ నిద్రిస్తుండగా విసుగు చెందిన తండ్రి దుర్గయ్య కొడుకు ప్రవర్తన నచ్చగా రాత్రి 12 గంటలకు కత్తితో దాడి చేసి చంపేశాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నామని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ రంగకృష్ణ, ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు