మెదక్ : మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కేంద్రం వట్టుర్ గ్రామం( Vattur Village) శివారులో బైక్( bike)ను జేసీబీ(jcb) ఢీకొన్నది. దీంతో బైక్ పై వెళ్తున్న కొంతన్పల్లి గ్రామానికి చెందిన బట్టు వెంకటేష్ (39)(Battu Venkatesh) కాలు విరిగి దూరం పడ్డది. ప్రమాదం లో వెంకటేష్ ఏడుమ కాలు పూర్తిగా తెగిపడింది. మరోవైపు పట్టణ కేంద్రంలో ఇంతకుముందు జరిగిన రోడ్డు ప్రమాదం మరువక ముందే మళ్లీ ఇలా జరగడంతో ద్విచక్ర వాహనదారులు భయపడుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.