రైతుల‌కు విరివిగా రుణాలివ్వాలి – జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

డిసిసిబి ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల‌కు పెద్దపీట వేయాలి
కమర్షియల్ బ్యాంకులతో పోటీపడి రైతులకు సేవలు అందించాలి
గృహ నిర్మాణ రుణాల్లాంటి వినూత్న పథకాలు చేపట్టాలి
కలెక్టర్ అధ్యక్షతన జ‌రిగిన ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సాంకేతిక కమిటీ సమావేశం

సంగారెడ్డి, జనవరి 8 ( సిరి న్యూస్ ) : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాల రైతులకు విరివిగా అందజేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి (sangareddy collector valluru kranthi) అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సాంకేతిక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమావేశంలో మాట్లాడారు. ది డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్. ఉమ్మడి మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి పంట రుణాల జారీకి వివిధ వ్యవసాయ ఉద్యాన పంటలకు వాస్తవిక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఫిక్స్ చేయడం , రికవరీ కి గడువు తేదీని ఖరారు చేయడం తదితరు అంశాలను సమావేశంలో చర్చించారు.

2025-26 సంవత్సరానికి డెయిరీ, షీప్ పోల్ట్రీ రుణాల జారీకి వివిధ డెయిరీ, గొర్రెలు , పౌల్ట్రీ యూనిట్‌లకు ఫైనాన్స్ రికవరీకి గడువు తేదీని సమావేశంలో నిర్ణయించారు. సహకార బ్యాంకులు నూతన రుణాలు అందజేయాలని కమర్షియల్ బ్యాంకులతో పోటీపడి రైతులకు సేవలు అందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా బ్యాంకు అధికారులకు విజ్ఞప్తి చేశారు. రైతుల నుండి రుణాలు ఇవ్వడంతో పాటు డిపాజిట్ల సేకరణ కూడా జరపాలన్నారు సహకార బ్యాంకుల ద్వారా రైతులకు గృహ నిర్మాణ రుణాల్లాంటి వినూత్న పథకాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈవో శ్రీనివాస్ ,ఎల్డిఎం గోపాల్ రెడ్డి , బ్యాంకు అధికారులు , సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.