శివంపేట్ జనవరి 8 (సిరి న్యూస్ ) : మెదక్ జిల్లాకు చెందిన రైతు రక్షణ సమితి సభ్యులు బుధవారం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న రైతు సదస్సుకు (Raithu sadassu) తరలి వెళ్లారు. రైతు సదస్సులో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. సేంద్రీయ పద్ధతిలో చిరుధాన్యాల సాగుపై అవగాహన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పత్రాల యాద గౌడ్ గౌరవ అధ్యక్షులు మైసయ్య యాదవ్, మిరియాల చంద్రశేఖర్, నర్సాపూర్ ఎడి సంధ్యారాణి, శివంపేట మండల అధికారి లావణ్య, మామిడి నర్సారెడ్డి,బోయిని రమేష్ యాదవ్,పి బాలేష్, గుదగాల బాలరాజు,పైనం నరసింహులు రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు.