రైతులు నచ్చిన మెచ్చిన చట్టం భూ భారత రెవిన్యూ చట్టం -మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి

సంగారెడ్డి, మే 17 ( సిరి న్యూస్ ): కొండాపూర్ మండల కేంద్రం లో భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ పై రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిధి గా హాజరైన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మినిస్టర్ గా నేను మా స్వార్థం కోసం ఈ చట్టాన్ని చేయలేదు 18 రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఉన్న ముఖ్యమైన అంశాలను తీసుకుని వేలాదిమంది అభిప్రాయాలను తీసుకొని మీరు నచ్చిన మెచ్చిన చట్టమే భూభారతి చట్టం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి తో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎంపి సురేష్ శెట్కార్, నారాయణ్ ఖెడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి , టీ జి ఐ ఐ సి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ ఎంఎ ఫహీం లు పాల్గొన్నారు.