సిరి న్యూస్ అందోల్ : అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో ఉన్న పాలకవర్గం ఆత్మీయ వీడ్కోలు సమావేశం మున్సిపల్ లో జరిగింది. మున్సిపల్ కౌన్సిలర్స్ మాట్లాడుతూ పదవులు ముఖ్యం కాదని తమ చేసిన పనులే భవిష్యత్తు రాజకీయాలకు ముందడుగు అని తెలియజేశారు. పట్టణ ప్రజలు సహకారంతో కొద్దిపాటి కొన్ని అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి కృషితో ఐదు సంవత్సరాల కాలంలో జరగని పనులు ఇప్పుడు మంత్రి సహకారంతో జరిగాయని తెలియజేశారు.
మున్సిపల్ కౌన్సిలర్స్ మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బందితో అనుబంధాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో తన వంతుగా పట్టణ అభివృద్ధిలో మున్సిపల్ కు తప్పకుండా సహకరిస్తానని అన్నారు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు, ఈ సందర్భంగా 20 మంది కౌన్సిలర్స్ ఐదు సంవత్సరాల అనుభవాన్ని ప్రజలతో మీడియా మిత్రులతో పంచుకున్నారు. అందోల్ -జోగిపేట మున్సిపల్ కమిషనర్ తిరుపతి కౌన్సిలర్ అందరిని శాలువలతో మెమోటోస్తో ఘనంగా సన్మానం చేశారు.