పురాతన ఆలయాల జీర్ణోధ్ధారణకు సంపూర్ణ సహకారం అందిస్తా
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
బండల మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు
పటాన్‌చెరు, జనవరి 5 సిరి న్యూస్ : మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (MLA Gudem Mahipal Reddy) తెలిపారు. ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ (Alvin Colony) శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ కేతకి రేణుక ఎల్లమ్మ మల్లికార్జున స్వామి దేవాలయం (Sri Sri Sri Bhramaramba Ketaki Renuka Ellamma Mallikarjuna Swamy Temple)లో నిర్వహించిన స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతరలో ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జాతరలు ప్రతీక అన్నారు. నియోజకవర్గంలో నూతన దేవాలయాలతో పాటు పురాతన ఆలయాల జీర్ణోధ్ధారణకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, గూడెం పల్లవి విక్రమ్ రెడ్డి, మల్లేష్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.