మల్లన్న స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి..
తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి..నీలం మధు ముదిరాజ్
పటాన్‌చెరు : మల్లన్న స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్‌చెరు మండలం పోచారం గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, జాతర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.
అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. జాతరలు ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి ని ప్రతిబింబిస్తాయని తెలిపారు. గ్రామాల్లో జరిగే ఉత్సవాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో పాటు ప్రజలంతా ఐక్యమత్యంగా కలిసి ఉంటారన్నారు. ఆ మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భిక్షపతి,కిష్టయ్య, నాగభూషణం,మల్లేష్,సత్తయ్య, దేవరాజ్,రవి,భద్రయ్య, నవీన్,మధు, ప్రవీణ్,జాతర నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.