మాజీ స‌ర్పంచ్‌కు పితృ వియోగం ..ప‌రామ‌ర్శించిన‌ న‌ర్సాపూర్‌ ఎమ్మెల్యే

శివంపేట్ జ‌న‌వ‌రి 3 సిరి న్యూస్ : శివంపేట మండల మాగదూంపూర్ గ్రామ మాజీ సర్పంచ్ అశోక్ (Ashok) తండ్రి సోము చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందినందున వారి అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత (Narsapur MLA Sunitha). అనంత‌రం అశోక్‌ను, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, శివంపేట్ తాజా మాజీ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా ,మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ ,మండల పార్టీ ప్రచార కార్యదర్శి బిక్షపతి దొంతి గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గ్రామ నాయకులు కత్తి గిరిబాబు శ్రీను సాబీర్ కైఫ్ తదితరులు పాల్గొన్నారు.