అనాధ చిన్నారుల సంక్షేమం కోసం ప్ర‌తి ఒక్క‌రూ పాటుప‌డాలి

బేతని సంరక్షణ అనాధ ఆశ్ర‌మంలో ప్రపంచ అనాధల దినోత్సవం
కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు,పంపిణీ చేసిన సూర్యం చౌహన్

శివ్వంపేట జనవరి 06 సిరి న్యూస్ : ప్రపంచ అనాధల దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా శివ్వంపేట మండలం మగ్దూంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బేతని సంరక్షణ అనాధ చిన్నారుల ఆశ్రమంలో అనాధ చిన్నారులకు కేక్ కట్ చేసి స్వీట్లు,పండ్లు,పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నాడు నిర్వహించారు.ఈ కార్యక్రమం నర్సాపూర్ నియోజకవర్గ గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం. సూర్యం చౌహన్ కుటుంబ సమేతంగా హాజరై నిర్వహించారు. అనాధ చిన్నారులతో గడపడం సంతోషకరంగా ఉందని సూర్యం చౌహన్ మాట్లాడుతూ అన్నారు.అనాధ చిన్నారుల కోసం ప్రతి ఒక్కరూ వారి సంక్షేమం కోసం పాటుపడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు,బేతని సంరక్షణ అనాధ ఆశ్రమంలో ఉన్న అనాధలు,చిన్నారులు,వృద్ధులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ చప్పట్లతో సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో అనాధ ఆశ్రమం ఇంచార్జ్ కర్మల్. ఆశ్రమం డైరెక్టర్ సాజి వర్గీస్ తదితరులు ఉన్నారు.