బిజెపి జిల్లా సామాజిక ప్రముఖ్ భైరంనర్సిములు..
చేగుంట: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని బిజెపి పార్టీ జిల్లా సామజిక ప్రముఖ్ భైరం నర్సిములు అన్నారు. పార్టీ ఆదేశాన్ని సారం ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో చేగుంట పట్టణం లో సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వెశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ద్వారా దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చిందని గుర్తు చేశారు. రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న అందజేసి ఆయనను గౌరవించాలని తెలిపారు. అనంతరం సఫాయి కార్మికులకు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు కరణం గణేష్,జిల్లా పరిరక్షణ అధ్యక్షుడు నాగరాజు, ,చింతల భూపాల్,సోమా సురేష్, కావేటి వెంకటేష్, సాయిబాబా,శివ, సఫాహి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.