కౌడిపల్లి : మండల పరిధిలోని వెల్మకన్న గ్రామంలో సోమవారంగ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉపాధి హామీ కూలీలకు 2023-2024 సంవత్సరానికి సంబంధించి గ్రామంలో జరిగిన పనులకు ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామ సభను గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఖాజిపేట రాజేందర్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి,, డీ ఆర్ పీ బాలకృష్ణ , ఏ పీ ఓ పుణ్యరాజు, టి ఏ హీరాలాల్, ఫీల్డ్ అసిస్టెంట్, డా,, శివకుమార్, కారోబార్ కైల నాగభూషణం, మాజీ వార్డ్ సభ్యులు, ఏఎన్ఎం లు, అంగన్ వాడీ టీచర్ లు, ఉపాది హామీ కూలీలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.