జిన్నారం : జిన్నారం మండల కేంద్రంలో సేక్షన్ కార్యాలయం లో పటాన్చెరువు విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ అధికారి భాస్కర్ రావు జిన్నారం, మండలాలకు సంబంధించిన విద్యుత్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వినియోగదారులకు రైతులకు ఉత్తమమైన సేవలు అందించాలని విద్యుత్ సిబ్బందికి సూచించారు రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ లోపాలను సవరించుకోవాలని కోరారు వినియోగదారులకు విద్యుత్ సిబ్బంది నాణ్యమైన సేవలు అందించి విద్యుత్ అంతరాయం లేకుండా సేవలందించాలని సిబ్బంది కి తెలియజేశారు నాణ్యమైన సేవలు అందించినప్పుడే విద్యుత్ బిల్లులు వసూలు చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. రైతుల కు రభి సీజన్లో నాణ్యమైన విద్యుత్ అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గుమ్మడిదల ADE దుర్గాప్రసాద్, జిన్నారం,బొంతపల్లిAE లు వెంకటేశ్వర్లు రవీందర్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.