బేటి బచావో -బేటి పడావో జిల్లాలో సమర్థవంతంగా అమలు – కలెక్టర్ రాహుల్ రాజ్

సిరి, మెదక్ ప్రతినిధి : మహిళా శిశు, వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిషన్ శక్తిమహిళా సాధికారిత కేంద్రం బేటి బచావో బేటి పడావో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ లు పోస్టర్లు ఆవిష్కరించి సిగ్నేచర్ క్యాంప్‌ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ…బాలికల విద్యతోనే సమాజాభివృద్ధి జరుగుతుందని, మహిళా సాధికారత దిశగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి బాలికకు భరోసా లభిస్తుందని తద్వారా మున్ముందు బాలికలు ఉన్నత స్థానానికి చేరుకుంటారని ఆశభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాసరావు, జిల్లా సంక్షేమ అధికారిని హైమావతి, జిల్లా వైద్యదికారి శ్రీరామ్, డిఇఓ రాధా కిషన్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి, డిపిఓ యాదయ్యతో పాటు ఇతర శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.