ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ ప్రతినిధి, జనవరి 22(సిరిన్యూస్‌) : ప్రజలను తప్పుదోవ పట్టిస్తే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. బుధవారం నాడు నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసి ఆస్పత్రి ప్రాంగణం మొత్తం కలియతిరిగి అన్ని వార్డులు పరిశీలించి సిబ్బంది, హాజరు పట్టికలు, స్టాక్ రిజిస్టర్లు ‌, రోగులు చికిత్స పొందే వార్డులు పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మందులు లేక రోగుల అవస్థలు అని కొందరు ఆవాస్తవ వార్తలు ప్రచురితం చేయడంపై స్పందించిన కలెక్టర్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశామన్నారు. ఆసుపత్రిలో సమర్థవంతంగా నిర్వహణ జరుగుతుందని ఎటువంటి లోటుపాట్లు లేవని రోగులు తమంతట తాము చెప్పడం చూస్తే ఆసుపత్రి సిబ్బంది చాలా బాగా పనిచేస్తున్నారని అర్థమవుతుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది విధి నిర్వహణపై నిఘానేత్రాల ద్వారా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుండి పర్యవేక్షణ చేయడం జరుగుతుందని వివరించారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్లను ఈ సందర్భంగా అభినందిస్తూ డాక్టర్ల మనోధైర్యం దెబ్బతిని విధంగా అసత్య ప్రచారాలు చేస్తే ఇకపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరిండెంట్ పావని సంబంధిత వైద్యాధికారులు తదితరులు ఉన్నారు.