చదువురాని నేతల మాటలు నమ్మొద్దు -డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి

పథకాల అమలు,అభివృద్ధి నిరంతర ప్రక్రియ
రాజకీయ లబ్ధి కోసమే రెచ్చగొడుతున్న బిఆర్ఎస్
డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి

గజ్వేల్ జనవరి 22(సిరి న్యూస్ ): సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అయితే చదువు రాని నేతల మాటలు నమ్మి రెచ్చిపోవద్దని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. బుధవారం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో ఆయన మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దృష్టికి పలు సమస్యలు రాగా, పదేండ్ల వ్యవధిలో కెసిఆర్ ను నమ్మి మోసపోయినట్లు స్పష్టం చేశారు.

అభివృద్ధి పేరిట ప్రజాదనాన్ని దుర్వినియోగం చేయగా, ఆ డబ్బంతా వారి జేబుల్లోకి వెళ్లిందని తెలిపారు. గజ్వేల్ తో సంబంధంలేని ఇతర ప్రాంతాల నేతలు ఇక్కడ పెత్తనం చేయడంతో తీవ్రంగా నష్టపోయామని అన్నారు. అయితే పేదలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు వర్తింప చేసే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు.

ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తుండగా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా తదితర పథకాలు అర్హులకు చేర్చనున్నట్లు పేర్కొన్నారు. అలాగే జాబితాలలో లేని పేదలు తిరిగి తమ పేర్లు నమోదు చేయించుకోవచ్చని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రతిక్షణం గజ్వేల్ ప్రజలకు తాను అందుబాటులో ఉండనుండగా, గతంలో జరిగిన తప్పిదాల ఫలితంగానే గజ్వేల్ లోని పేద వర్గాలకు డబల్ బెడ్ రూమ్ లు అందలేదని చెప్పారు. కెసిఆర్ అధికారంలో ఉన్నప్పటికీ అర్హులైన పేదలకు ఇండ్లు ఇవ్వకపోగా, ఆ తప్పిదాన్ని కొంతమంది సిగ్గులేని నేతలు తమపై నెట్టుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అధికారులు ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా పథకాలను వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు.