ప్రజా సమస్యల పరిష్కార దిశగా పని చేయాలి..
జిల్లా అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాహుల్ రాజ్..
మెదక్ : ప్రజావాణికి వచ్చే దరఖాస్తులపై అలసత్వం వద్దని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. వివిధ సమస్యలతో వచ్చే ప్రజల నుంచి సోమవారం నాడు ప్రజావాణిలో వచ్చిన 61 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన విజ్ఞప్తుల పరిష్కారం దిశగా అత్యంత ప్రాధాన్యతతో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. అర్జీలు పెండింగ్ లో లేకుండా త్వరితగతిన పరిష్కరించి, పూర్తిచేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి సోమవారం తప్పనిసరిగా నిర్వహించాలని, అందుకు తగ్గట్లుగా ఆయా మండలాలలో ప్రచారం చేపట్టాలని ఆదేశించారు.