గోవుల, పశువుల అక్రమ రవాణను పకడ్బందీగా అరికట్టాలి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 6 (సిరి న్యూస్): బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల, పశువుల అక్రమ రవాణ జరగకుండా జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన మాడ్గి చెక్ పోస్ట్ ను శుక్రవారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ సిబ్బందితో మాట్లాడుతూ.. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, గోవుల, పశువుల అక్రమ రవాణ జరగకుండా చూడాలని అన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, నైట్ టైమ్ చెక్ పోస్ట్ నందు విధులు నిర్వహించే సిబ్బంది, లైట్ బాటన్, రెఫ్లెక్షన్ జాకెట్ ధరించాలని సూచించారు. అత్యవసర సమయంలో కంట్రోల్ కు సమాచారం అందించాలని అన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమయించి పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే చట్టరిత్య కఠిన చర్యలు తప్పవు అన్నారు. అనంతరం చిరాగ్ పల్లి పోలీసు స్టేషన్ ను సందర్శించి, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. స్టేషన్ రికార్డ్లను తనిఖీ చేస్తూ.., అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డ్ లను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తూ ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని అన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్లో ఉండాలని, నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి భాదితులకు అండగా నిలవాలని సూచించారు. సిబ్బంది అధికారులు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని, హిస్టరీ షీటర్స్, సస్పెక్ట్స్, పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, నైట్ బీట్, పెట్రోల్లింగ్ అధికారులు వీధి నిర్వాహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మన చుట్టూ జరుగుతున్న ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, రోడ్డు ప్రమాదాల గురించి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా జిల్లా ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, యస్.హెచ్.ఓ కు సూచించారు. ఈ విజిటింగ్ నందు ఎస్పీ వెంబడి జహీరాబాద్ డియస్పీ, సైదా నాయక్, టౌన్ ఇన్స్పెక్టర్ శివలింగం, రూరల్ ఇన్స్పెక్టర్ హనుమంతు, తదితరులు ఉన్నారు.