ఝరాసంగం : పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలంటు పది అనంతరం విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వివిధ కోర్సులపై విఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ నాయుడు విద్యార్థులకు అవగాహన కల్పించారు. శనివారం మండల పరిధిలోని కుప్పానగర్ ఉన్నత పాఠశాల, మాచ్నూర్ లోని కేంద్రీయ విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు హైదరాబాదులోని బాచుపల్లి వి ఎస్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాల బృందం పరీక్ష సామాగ్రి (ప్యాడ్లు, పెన్నులు) లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ప్రొఫెసర్లు సందీప్ చైతన్య, హరిప్రియ, రమేష్ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశం, విఎస్ఆర్ కళాశాల బృందం, పాఠశాల సిబ్బంది, నాయకులు రాజుస్వామి, రాజరత్నం, దేవిపుత్ర,తుల్జారాం ,కార్తీక్,సంతోష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.