చిలిపిచేడ్ జనవరి 25 (సిరి న్యూస్)
మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలో శనివారం నాడు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కులను నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి చిలిపిచేడ్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిలిపిచేడ్, అజ్జమర్రి, సొమ్మకపేట, ఫైజాబాద్, చిట్కుల్, బండపోతుగల్, రాందాస్ గూడా, చండూర్, గౌతపూర్, శిలాంపల్లి, రహీంగూడ తండా గ్రామాల పలువురుకి 8,09,000 రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారుల, వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చిలిపిచేడ్ మండల అధ్యక్షులు నారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు పాండరి, మాజీ ఎంపీపీ వినోద దుర్గారెడ్డి,మాజీ వైస్ఎంపీపీ విశ్వంభార స్వామి, పిఎసిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సుభాష్ రెడ్డి,గ్రామ అధ్యక్షులు నర్సింలు, సీనియర్ నాయకులు తారా విష్ణువర్ధన్ రెడ్డి,అంజి రెడ్డి,శంకర్, సుధీర్ రెడ్డి,పాపయ్య,మల్లేశం,రాజు,సుధాకర్,మల్లేశం, నగేష్, వెంకయ్య, సంతోష్,శంకర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, నర్సింలు, రెడ్డి నాయక్,గ్యాలబోయిన నర్సింలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.