పోతిరెడ్డిపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందజేత

సంగారెడ్డి జనవరి 6 సిరి న్యూస్ : ఎల్ఐసి ఆఫీసర్స్ అసోసియేషన్ ఫౌండేషన్ డే సందర్భంగా సంగారెడ్డి లోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా శాఖ క్లాస్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు స్థానిక పోతిరెడ్డిపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ డివిజన్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుల్లూరి ప్రకాష్, మాట్లాడుతూ అసోసియేషన్ ఫౌండేషన్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక సేవా కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు.

ఎల్ఐసి బ్రాంచి మేనేజరు మారుతి రావు, మాట్లాడుతూ సేవకు మారుపేరుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అందరికి అందుబాటులో ఉంటూ ఆదుకుంటున్నదని అన్నారు. హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు విద్యాసాగర్, మాట్లాడుతూ.. ఎల్.ఐ.సి ఆఫీసర్స్ ఎంతో సేవా సంకల్పంతో పాఠశాల విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఈ స్పోర్ట్స్ సామాగ్రిని అందజేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ,సతీష్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హెచ్ ఎన్ ఎన్ ఓ గీత , వ్యాయమ ఉపాధ్యాయులు ,పాండు జ్యోతిర్మయి, ఉపాధ్యాయ బృందం., తదితరులు పాల్గొన్నారు.