నార్సింగి, జూన్ 2 (సిరి న్యూస్): నర్సంపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్షాలు పట్టు పట్టి జెండా ఆవిష్కరణ ను అడ్డుకున్నారు. జెండా గతం నుంచి భవనం పై ఎగుర వేసామని, ఈ సంవత్సరం కూడా అలాగే చేస్తామని బీఆర్ఎస్ పక్షం, భవనం ముందు భాగం లో భూమిపై ఎగుర వేయాలని, భవనం పై జెండా ఆవిష్కరణ చేస్తే పెద్దలు భవనం పై ఎలా ఎక్కుతారని, లేక పోతే కార్యక్రమాన్ని బాయ కాట్ చేస్తామని కాంగ్రెస్ పక్షం వారు పట్టు పట్టడం తో ఇరు పక్షాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. జెండా ఆవిష్కరణ 8:30 కు చేయాలని అనుకున్నా రాజకీయ పరిణామాల వల్ల 9:30 దాటినా జెండా ఆవిష్కరణ జరగలేదు. పంచాయితీ కార్యదర్శి కార్యక్రమాన్ని సజావుగా సాగించడానికి పై అధికారుల తో సంప్రదింపులు జరిపి ఇరు పక్షాలకు సముదాయించడానికి ప్రయత్నిస్తున్నారు. జెండా ఆవిష్కరణ కోసం వచ్చిన పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయురాలు పాఠశాలలు తీసుకుని వెళ్ళిపోయారు. 9:45 వరకు కూడా గ్రామంలో ఎక్కడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా జరిగే జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించలేదు.
Home బ్రేకింగ్ న్యూస్ ప్రత్యేక రాష్ట్ర సాధన జెండా ఆవిష్కరణ పై ఇరు పక్షాల వివాదం, గ్రామ వ్యాప్తంగా నిలిచిన...