హెచ్ఎండిఏ పరిధిలో 675 చెరువుల మ్యాపులు సిద్ధం చేయాలి
ఫిర్యాదులు రాకుండా సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి, ఫిబ్రవరి 4 ( సిరి న్యూస్ ) : ధరణి, మీసేవ లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అనే జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, సర్వే ల్యాండ్ రికార్డు అధికారులతో జిల్లాకలెక్టర్ క్రాంతి వల్లూరు సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అధికారులు ప్రజలకు అందుబాటులో వుండాలి , ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని , ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదులు తన వద్దకు రాకూడదని అన్నారు. అధికారుల పనితీరుపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్క అధికారి పని తీరు ఫీడ్బ్యాక్ తన వద్ద ఉన్నట్లు తెలిపారు. ధరణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అన్ని మాడ్యుల్స్ లో దాఖలైన ధరణి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలి అన్నారు.
సక్సేషన్, పెండింగ్ మ్యూ టేషన్ వంటి దరఖాస్తులను అవసరమైన రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి ఆర్డీవో స్థాయిలో పూర్తిగా పరిశీలించిన తరువాత నే కలెక్టరేట్ కు పంపించాలి. రెవెన్యూ అధికారులతో, మీసేవ సంబంధిచిన ఆన్లైన్ సమస్యలపై ఇప్పటివరకు పరిష్కరించిన దరఖాస్తుల వివరాలు , పెండింగ్ వివరాలు ఆరా తీశారు. పెండింగ్ ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. , మీసేవ దరఖాస్టులు, కుల ,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం అలసత్వం వహింంచకుండా నిర్ణీత వ్యవధిలో అందించాలని ఆదేశించారు .చెరువులు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ , రెవెన్యూ ,సర్వే ల్యాండ్ రికార్డు అధికారులను ఆదేశించారు . హెచ్ఎండిఏ పరిధిలో 675 చెరువుల కు సంబంధించిన డిజిటల మ్యాపులు సిద్ధం చేయాలన్నారు . ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, చంద్రశేఖర్ , మాధురి , ఏ డి సర్వే ల్యాండ్ అధికారి అవినాష్ నాయక్ , ఆర్డీఓ రవీంధర్ రెడ్డి , ఈ ఈ ఇరిగేషన్, తహసీల్దార్లు , కలెక్టరేట్ సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.