అమ్మ ను దర్శించుకున్న, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి
భక్తులకు తగిన సౌకర్యాలు కలిపించిన ఆలయ కమిటీ సభ్యులు.
సిరి న్యూస్ చేగుంట జనవరి 29 : పవిత్ర పుణ్య క్షేత్రం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మాఘ అమావాస్య జాతరకు ఆలయ అర్చకులు తెల్లవారుజామున శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మాఘ అమావాస్య రోజు అమ్మవారిని చేసేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రధానంగా జంట నగరాలైన హైదరాబాదుతో పాటు, పొరుగు రాష్ట్రాలు అయినా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సుమారు లక్షల మంది భక్తులు తరలి వచ్చారు
మాఘ అమావాస్య పురస్కరించుకొని శ్రీ రేణుక అమ్మ వారిని వివిధ రూపాలలో మొక్కుల్లో చెల్లించుకున్న భక్తులు, భక్తుల సౌకర్యాల కోసం ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చేగుంట ఎస్ ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీ రేణుక ఎల్లమ్మ మాత అమ్మవారిని దర్శించుకున్న, కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు
మాఘ అమావాస్య పురస్కరించుకొని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి,శ్రీ రేణుక మత భవాని మాత అమ్మవారిని దర్శించుకున్నరు.
.