నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన డిప్యూటీ తాసిల్దార్ రాజు పటేల్ 

Deputy Tahsildar Raju Patel unveiled the new calendar
Deputy Tahsildar Raju Patel unveiled the new calendar

నారాయణఖేడ్: మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో నూతన క్యాలెండర్ ఐస్కరించిన డిప్యూటీ తాసిల్దార్ రాజు పటేల్ ఎలక్షన్ కంప్యూటర్ ఆపరేటర్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ఆవిష్కరించారు. కంప్యూటర్ ఆపరేటర్లు ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం కూడా చేయడం మారుమూల ప్రాంతాల్లో కూడా ఓటర్లను అవగాహన కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు చిరంజీవి, ఎలక్షన్ కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్, జైపాల్ మాణిక్ నాయక్, కిషన్, నదీమ్, ధరణి ఆపరేటర్ రాజు, మీ సేవ ఆపరేటర్ కృష్ణ, ఏఐటియుసి నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.