- సిరి వార్త ఫెక్ట్…
అమీన్పూర్ సర్వేనెంబర్ 945లో కూల్చివేతలు
సంగారెడ్డి ప్రతినిధి, మే 30 (సిరి న్యూస్): పటాన్ చెరు నియోజకవర్గం అమీన్పూర్ ప్రాంతం సర్వే నంబర్ 945 శిఖం కుంటలో హలో కబ్జాదారులు… ఖల్ నాయక్లకు అడ్డాగా మారింది. అనే వార్త వరుస కథనాలు సిరి పత్రికలో ప్రచురితం కావడంతో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాను ఆక్రమిస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనే.. వరుస కథనాలు ప్రచురించడంతో అధికార యంత్రాంగం హైడ్రా అధికారులు 945 అమీన్పూర్ సర్వే నంబర్ లోని బఫర్ జోన్, ఎఫ్ టి ఎల్లో అక్రమ కట్టడాలను నిర్మిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు శుక్రవారం కూల్చి వేతలు ప్రారంభించారు. ఇప్పటికైనా చెరువులు కుంటలు నాళాలను ప్రభుత్వ అధికారులు యంత్రాంగం కాపాడి, అక్రమార్కులకు కల్పతరువుగా మారినటువంటి అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లకుండా తగు చర్యలు తీసుకొని చెరువులు కుంటలను కాపాడాలని పలువురు అమీన్పూర్ వాస్తవ్యులు ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుకుంటున్నారు