మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా సైబర్ వల -క్రైమ్ ఎసిపి జి. శ్రీనివాస్.

అప్రమ‌త్త‌తే ఆయుధం
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎసిపి జి. శ్రీనివాస్.

సిద్దిపేట‌, జ‌న‌వ‌రి 21 సిరి న్యూస్ : గజ్వేల్, జగదేవపూర్, చేర్యాల్, మద్దూర్ మరియు సిద్దిపేట పట్టణం ఏరియాలో మీద మల్టీ లెవెల్ –మార్కెటింగ్ ద్వారా ఎక్కువ మొత్తంలో లాభాలు పొందావచ్చు అనే ఒక్క అసత్య ప్రచారం జరుగుతుంది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా Crypto కరెన్సీ, ఆగ్రో గార్మెంట్స్, హెర్బల్ & హెల్త్, గృహ పరికరాలు వంటి వాటి పైన పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ మొత్తంలో లాభాలు గణిoచవచ్చు అనే ప్రచారo ద్వారా సైబర్ నేరగాళ్ళు ప్రజలని ఆకర్షిస్తున్నారు.

ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మవద్దు, మొదటగా సైబర్ నేరగాళ్ళు రకరకాల మయా మాటలతో ఆఫర్స్ పెట్టి ప్రజలనుండి సభ్యత్వాలను స్వీకరించి, వారితో మరికొంతమందిని సభ్యులుగా చేర్పించే ప్రయత్నం చేస్తూ, ఎంత ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పిస్తే అంత అధిక మొత్తంలో డబ్బులు తిరిగొస్తాయని ప్రజల్ని నమ్మించి, మభ్యపెట్టి, మొదటగా ఇన్వెస్ట్మెంట్ పెట్టినవారికి చిన్న మొత్తంలో లాభాలు ఇస్తూ, ఈ విధంగా వారిని ఆకర్షిస్తు, వారి ద్వారా ఎక్కువ అధిక రాబడులు, దినసరి ఆదాయం, కమిషనలు ఎక్కువ మొత్తంలో రావడానికి ఇంకా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని వాళ్ళను మభ్యపెడ్తూ కొత్త కొత్త స్కీమ్ లతో బహిరంగ మార్కెట్లోకి వస్తున్నారు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇలాంటి వాటిని నియంత్రిచలంటే వాట్సాప్‌, టెలిగ్రాం, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామం వంటి సోషల్ మీడియా లో వచ్చే అనుమానిత లింకులను, ఏపీకే ఫైల్స్‌, అఫ్లికేష‌న్స్‌ ఎవరు కూడా ఓపెన్ చేయడం కానీ,ఇన్‌స్టాల్ చేయ‌డం చేయడం కానీ చేయవద్దని, ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో కరెన్సీ , మల్టీ లెవెల్ మార్కెటింగ్ కి సంబంధించిన గ్రూపూలయందు ఎవరు కూడా సభ్యత్వo కల్గి ఉండకుడదని, ఇలా చేయడం ద్వారా కొంత మేరకు సైబర్ క్రైమ్ కి గురికాకుండ నియంత్రిచగలo అని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసిపి జి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.