ఐదు క్లస్టర్ల పరిధిలో ప్రారంభించిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
వసతి గృహాల నిర్వహణపై నివేదికలు సమర్పించాలి
పరిశ్రమల యాజమాన్యాలు అభివృద్ధి పనులకు సహకరించాలి
సంగారెడ్డి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షలో మంత్రి రాజనర్సింహ
సంగారెడ్డి, జనవరి 3 సిరి న్యూస్ : తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Rajanarsimha) శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, పరిశ్రమల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి సిఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు , జిల్లాలోని వసతి గృహాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులను విద్య, వైద్య రంగాల అభివృద్ధి కోసం ప్రధానంగా వినియోగించాలని ఆదేశించారు. జిల్లాలో ఐదు క్లస్టర్ల పరిధిలో ప్రారంభించిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పరిశ్రమల యాజమాన్యాలు తమ బాధ్యతగా అభివృద్ధి పనులకు సహకరించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలు, బాలబాలికల గురుకుల పాఠశాలలు, కాలేజీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.వసతి గృహాల పరిస్థితి, మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల సంఖ్య, హాస్టల్ భవనాల పరిస్థితి వంటి అంశాలను ప్రాధాన్యతగా చర్చించారు.
వసతి గృహాల్లో తాగునీరు, ప్రభుత్వ వసతిగృహాల నిర్వహణ , ప్రయివేటు భవనాలలో నడుస్తున్న వసతి గృహాల నిర్వహణపై నివేదికలు సమర్పించాలాలని అధికారులను ఆదేశించారు . జిల్లాలోని వసతి గృహాల పనితీరు మెరుగుపరచుట హాస్టల్ బిల్డింగులు వివరాలు , మౌలిక సదుపాయాల కల్పన అద్దె భవనాలు ,సొంత భవనాలు వివరాలు వాటి రిపేర్లు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు . విద్యార్థుల సంఖ్య వివరాలు వసతి గృహాల నిర్వహణపై పాత కొత్త విద్యుత్, శానిటేషన్ వంటి మౌలిక అవసరాలను మెరుగుపరచాలని సూచించారు.
సంక్షేమశాఖాధికారులు వసతి గృహాల నిర్వహణ నివేదికలను జిల్లా కలెక్టర్‌కు అందజేయాలని స్పష్టం చేశారు. వసతి గృహాల మెరుగుదల జిల్లాలో విద్యార్థుల అభ్యున్నతికి కీలకమని, ఈ పనులు సమయానుసారం పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, పరిశ్రమల శాఖ అధికారులు, విద్యాశాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, పరిశ్రమల యాజమాన్యాలు ప్రతినిధులు, పాల్గొన్నారు.