– సిపిఎం మెదక్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ.మల్లేశం..
– కొల్చారం మండలం రంగంపేటకు చేరిన అమరవీరుల జ్యోతి యాత్ర..
కొల్చారం : ప్రజా సమస్యల పరిష్కారానికై సాయుధ రైతాంగ పోరాటాలు చేసిన అమరుల సాక్షిగా నేడు సిపిఎం పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తుందని సిపిఎం మెదక్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ. మల్లేశం అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర సీపీఎం 4వ మహాసభల సందర్భంగా మెదక్ జిల్లాలోని కామ్రేడ్ కేవల్ కిషన్ పొలంపల్లి సమాధి వద్ద ప్రారంభమైన జ్యోతి యాత్ర కొల్చారం మండలం రాంపూర్, కిష్టాపూర్, పోతంశెట్టిపల్లి మీదుగా రంగంపేటకు చేరుకుంది. ఈసందర్బంగా సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మల్లేశం మాట్లాడారు.
సీపీఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా సంగారెడ్డి లో నిర్వహించే భారీ బహిరంగ సభకు బైక్ ర్యాలీగా అమరవీరుల జ్యోతి యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యాత్ర మెదక్ జిల్లాలోని కామ్రేడ్ కేవల్ కిషన్ పొలంపల్లి సమాధి వద్ద నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీగా చిన్న శంకరంపేట, కొల్చారం మండలాల మీదుగా వెళ్తూ జోగిపేట నుంచి సంగారెడ్డికి చేరుతుందని తెలిపారు. సిపిఎం తెలంగాణ నాల్గవ మహాసభల సందర్భంగా రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై చర్చించుకోవడం జరుగుతుందని తెలిపారు. సాయిధరైతంగా పోరాటంలో అనేకమంది ప్రాణ త్యాగాలు చేశారని అమరుల సాక్షిగా అమరవీరుల జ్యోతిని ప్రారంభించడం జరిగిందన్నారు. దేశ, రాష్ట్ర సమస్యల మీద సీపీఎం పోరాటంచేయడంతో నేడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని తెలిపారు. అలాగే కామ్రేడ్ కేవల్ కిషన్ పోరాటాస్ఫూర్తిని మెదక్ జిల్లాలో కొనసాగిస్తామని ఇందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు.