కవులు, రచయితలు, కళాకారులతో జనకవనం నిర్వహణ..
ముఖ్య అతిథిగా ప్రజా కవి గోరేటి వెంకన్న..
సంగారెడ్డి: సంగారెడ్డిలోని కిషన్ భవన్ నందు ఈనెల 4న సిపిఎం తెలంగాణ రాష్ట్ర నాలుగు మహాసభల సందర్భంగా కవులు కళాకారులు, రచయితలతో ( జనకవనం ) నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.రాజయ్య, కే, రాజయ్య వ్యవహరించనుండగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ప్రజా కవి గోరేటి వెంకన్న, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్. వీరయ్య, తెలంగాణ సాహితి అధ్యక్షులు వల్లబాపురం జనార్ధన్, తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి ఆనందచారి, ప్రజా నాట్యమండలి ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ, ఎకె సలీమా, సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజు, ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి ఎ.నాగభూషణం పాల్గొననున్నారు.