సిరి న్యూస్ అందోల్ : ప్రభుత్వ హాస్పిటల్స్ సిబ్బందికి 2 నెలలు పెండింగ్ వేతనాలు చెల్లించాలి ఏఐటిసి ఆధ్వర్యంలో జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ సౌజన్య గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏఐటీయూసీ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట్ రాజ్యం ఏఐటీయూసీ జిల్లా నాయకులు చిరంజీవి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ హౌస్ కీపింగ్ పేషెంట్ కేర్ సిబ్బందికి 2 నెలల వేతనాలు చెల్లించకపోవడం వలన కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బంది ఎదురుకుంటున్నారు.
వీరందరికీ వెంటనే వేతనాలు ఇవ్వాలని కోరడం జరిగింది . ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జోగిపేట ప్రభుత్వ దవాఖాన సూపర్డెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని లేనియెడల రేపటినుండి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మికులు లక్ష్మి శ్రావణి రాణి నాగరాజ్ లక్ష్మి హరి తదితరులు పాల్గొన్నారు.