ప్రోటోకాల్ కోసం పోటీలు

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెగింపు గలవారు -ఆవుల రాజిరెడ్డి

చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీ లోనే ఉంటా -ఆంజనేయులు గౌడ్

పదవుల కోసం రాజకీయాలకు రాలేము -సువాసిని రెడ్డి

నర్సాపూర్ జనవరి 28 (సిరి న్యూస్) : కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల అమల్లో భాగంగా గ్రామసభలు నిర్వహించిన సందర్భంలో నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ విషయంలో గందరగోళం నెలకొన్నాయి. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మరియు జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి ఇద్దరి మధ్య ఫోటో కాల్ విషయంలో రాద్ధాంతాలు జరిగాయి దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాజిరెడ్డి క్యాంప్ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించారు రాజిరెడ్డి మాట్లాడుతూ తమ నాయకులను కార్యకర్తలను అవమానించే విధముగా చేస్తే ఊరుకోమని వీధి పోరాటాలకు సిద్ధమన్నారు మా పట్టింపు ముందు తెగింపు ముందు మీరు సరి పోరని మీకు కేవలం లాబింగులు పదవుల తప్ప ప్రజల మీద ప్రేమ లేదని మీ పార్టీ కార్యకర్తలకు ఏమి చేసావని కార్యకర్తలను వర్గాలుగా విభజించి ఒక వర్గానికి నాయకత్వం వహించి ఆ వర్గానితో జేజేలు అనిపించుకొని పదవులతో పబ్బం గడుపుకోవాలి.

నర్సాపూర్ నియోజకవర్గానికి మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పండి రోడ్లు అధ్వానంగా ఉన్నాయి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే నర్సాపూర్ లో మీకు పుట్టగతులు ఉండవని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ అసహనంతో విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలను అవమానించారు వారిని మభ్య పెట్టారు ఇప్పుడు వారు తిరగబడుతారు జాగ్రత్త మా పార్టీ జెండా కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు ఉన్నారని వారి జోలికొస్తే ఊరుకోమన్నారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ పెద్దల కాలు మొక్కి అయినా సరే అభివృద్ధి చేసుకుంటామని ఎవరికీ ఇచ్చే గౌరవం వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అంతే గాని హేళన చేసి మాట్లాడడం మాకు తెలియదు మీరు పార్టీ మారి కార్యకర్తలను నటేట్ల ముంచారు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన చరిత్ర నీది అని విమర్శించారు మీకు గౌరవం ఇవ్వము కాదు ఎమ్మెల్యే పదవికి గౌరవం ఇస్తాము అని అన్నారు.

సువాసిని రెడ్డి మాట్లాడుతూ ప్రోటోకాల్ విషయంలో వెంకటాపురం గ్రామసభలో ఎమ్మెల్యే సునీతా రెడ్డి నన్ను మీకు ప్రోటోకాల్ ఉన్నదా ఉన్నదా అని నన్ను అడగడంతో అధికారులు ప్రోటోకాల్ ఉన్నది అని చెప్పారు విచక్షణ లేకుండా మాట్లాడడం ఒక మహిళకు ఇచ్చే గౌరవం కూడా ఇవ్వడం లేదని 26 సంవత్సరాలు రాజకీయం అనుభవం కలిగిన వ్యక్తి ప్రోటోకాల్ విషయంలో తనకు ఎలా హక్కు ఉంటుందో ఇతరుల ప్రోటోకాలను పరిరక్షించాల్సిన బాధ్యత తనకు ఉండాలని హోర్పు ,సహనం కోల్పోవడం నియోజకవర్గం ప్రజలు సిగ్గుపడుతున్నారని అన్నారు చెక్కులు పంపిణీ చేసే సమయంలో 6 గ్యారంటీల పథకాలు గురించి ప్రజలకు వివరిస్తున్న సమయంలో నా చేతిలో నుండి మైక్ లాగేసుకోవడం చాలా బాధ కలిగించింది అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.