కాలువ‌ల నిర్మాణానికి స‌హ‌క‌రించాలి

Construction of canals should be supported
Construction of canals should be supported

-గౌర‌వెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల‌తో మాట్లాడి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తున్నా
-ఈ ప్రాజెక్టు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని మంత్రి ఉత్త‌మ్ హామీ ఇచ్చారు
-రెండుసార్లు ఎంపిగా గెలిచి బండి సంజ‌య్ అక్క‌న్న‌పేట‌కు రాలేదు
-గెలిచిన సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం
-స్థానిక సంస్థ‌ల్లో కాంగ్రెస్ విజ‌యానికి ప్ర‌తి కార్య‌క‌ర్త కృషి చేయాలి

అక్క‌న్న‌పేట‌:సిద్దిపేట[Siddipet] జిల్లా అక్కన్నపేట [Akkannapet] మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్ర‌వారం జ‌రిగింది. ఈస‌మావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల [Gandipally Project] నుండి కాలువల నిర్మాణం కోసం అందరూ పెద్ద మనసుతో సహకరించాల‌న్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులతో మాట్లాడి వారిని బుజ్జగించైన సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తున్నాన‌న్నారు.

ఈ ప్రాజెక్టులో నీళ్లు నింపడం, కాలువల నిర్మాణం, భూనిర్వాసితుల సమస్యల పరిష్కారం మార్చి తర్వాత చేద్దామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చార‌న్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన కేంద్రమంత్రి బండి సంజయ్ అక్కన్నపేట మండలానికి ఒక్కసారి కూడా రాలేద‌న్నారు. ఏమి అభివృద్ధి చేయలేద‌న్నారు. అక్కన్నపేట మండల కేంద్రం ఏర్పాటు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం మండలంలో ఏమీ అభివృద్ధి చేయలేద‌న్నారు. గెలిచిన సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రతి కార్యకర్త ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.