తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా!
బీఆర్ఎస్ పార్టీమండల అధ్యక్షులు రమణ గౌడ్ !!
శివంపేట్ జనవరి 29 సిరి న్యూస్ : ప్రజలచే ఎన్నుకోబడిన మహిళ ఎమ్మెల్యే అని చూడకుండా ప్రభుత్వ హామీలు నెరవేర్చడం చేతగాని కాంగ్రెస్ నాయకులు అధికారిక కార్యక్రమాలలో ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే గౌరవానికి భంగం కలిగిస్తున్నారని శివంపేట మండల జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా మరియు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజా రమణా గౌడ్ అన్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ సభలుగా మారుస్తున్నారని విమర్శించారు.
గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్ కోసమే ప్రభుత్వం పథకాల ఆశ చూపుతుందని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు.
రాబోయే లోకల్ సర్పంచ్ ఎన్నికల కోసమే నాలుగు పథకాలు అంటూ మండలానికి ఒక్క గ్రామానికి మాత్రమే ఇవ్వడం సిగ్గుచేటు. కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే అన్ని గ్రామాల ప్రజలకు అర్హులైన వారందరికీ పథకాలు వచ్చేలా కృషి చేయాలి.ఇకనైనా కాంగ్రెస్ నాయకులు చౌకబారు విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో సర్పంచ్ ఎలక్షన్ లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ఈ సమావేశంలో తాజా మాజీ ఉపసర్పంచ్ రాజపేట పద్మా వెంకటేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దగాల లక్ష్మీ నరసయ్య,రమేష్ గుప్తా, ఒరేయ్ శ్రీనివాస్ యాదవ్, కమలయ్య గారి అర్జున్, ముద్దగల రాజు, కొత్తపేట శ్రీనివాస్ గౌడ్,త్రినేష్ గౌడ్ దొడ్ల అశోక్,వజ్జ లక్ష్మణ్, హరీష్,రేవంత్ మంగలి ప్రసాద్ రస్తుంపేట్ సాయి జోగిని నవీన్, పి ఎం జి యువసేన సభ్యులు బి ఆర్ ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.