
చింత ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు..
సంగారెడ్డి: సదాశివపేట పట్టణంలోని 16,24,వార్డుల్లో ప్రజా పాలన వార్డు సభ కార్యక్రమంలో సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ పాల్గొన్నారు. 2018లో టి.యు.ఎఫ్.ఐ.డి.సి ఉత్తర్వుల సంఖ్య NO: 436/ కొత్త పనుల 02.07.2018 “దివి” నుంచి మంజూరైన 5 కోట్ల నుంచి 2.85 కోట్లకు టెండర్ ప్రక్రియ పూర్తి అయింది. ఇందులో నుంచి (2.85 CR) తో చేపట్టిన పనులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సదాశివపేట బసవేశ్వర్ స్టాచు నుంచి అయ్యప్ప ఎస్ మార్ట్ సూపర్ మార్కెట్ వరకు రూ.30 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు.
సదాశివపేట పట్టణంలోని 10వ వార్డులో రూ.48.50 లక్షలతో సిసి డ్రైన్ పనులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు ప్రారంభించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ… ప్రజాపాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన…ప్రభుత్వ పథకాలు అసలైన అర్హులకు అందజేయాలి… కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలకు ప్రజలు ఎదురు చేస్తున్నారు… ప్రభుత్వం ఏర్పాటు అయిన వంద రోజులో పథకాలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్…! ఇప్పటి వరకు పథకాలు అమలు కాలేదు… హైదరాబాద్ నుంచి వచ్చిన లిస్టులో ఉన్నవారికి కాకుండా నిజమైన అర్హులకు పథకాలు అమలు చేయాలి…రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్ధిదారులను ఎంపిక పారదర్శకంగా ఉండాలి …అక్కచెల్లమ్మలకు కెసిఆర్ ఇచ్చే లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు.
తులం బంగారం సంగతి. ..?మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఇస్తామన్న హామీ ఏమైంది…పింఛన్ డబ్బుల కోసం అవ్వాతాతలకు ఎదురుచూపులు…కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వృద్ధుల పింఛన్లను రూ.4 వేలకు, దివ్యాంగులకు రూ.6వేలు ఇస్తామని చెప్పి మొఖం చాటేశారు… కార్యక్రమంలో లో మున్సిపాల్ చైర్ పర్సన్ అపర్ణ పటిల్, వైస్ చైర్మన్ చింత గోపాల్, నాయకులు శివరాజ్ పాటిల్, ఇంద్రమోహన్ గౌడ్, విద్యాసాగర్ రెడ్డి, చౌదరి ప్రకాష, కోడూరి అంజయ్య, సాతని శ్రీశైలం, మోబిన్, వీరేశం, సత్యం, మున్సిపల్ అధికారులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.