వైఎస్ హయాంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు
రేవంత్ రెడ్డి సైతం మహిళలను కోటీశ్వరులను చేస్తానని హామీ ఇచ్చారు
ఇచ్చిన హామీని అమలు చేసే తీరుతారు
– టీజీఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి
పారిశుద్ధ్య కార్మికుల స్వెటర్లు పంపిణీ చేసిన నిర్మల జగ్గారెడ్డి
రామచంద్రాపురం, జనవరి 4 సిరి న్యూస్ : రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎంతో కృషి చేస్తున్నారని టీజీఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి తెల్లాపూర్ లో అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు కొల్లూరి సత్తయ్య, కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో చేపట్టిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో (Savitribai Phule Jayanti celebrations) ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. మున్సిపాలిటీలో పనిచేసే 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు స్వెటర్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని తెలిపారు.
నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మహిళలను కోటీశ్వరులను చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని తెలిపారు. మహిళలు చదువుతూనే అన్ని రంగాల్లో రాణిస్తారు అన్న లక్ష్యంతో నాడు సావిత్రిబాయి పూలే మహిళలు చదువుకునే విధంగా ప్రోత్సహించడం జరిగిందని తెలిపారు. నాటి ఆమె కృషి వల్లనే నేడు తాము చదువుకొని ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు. అలాంటి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. కొల్లూరి సత్తయ్య ఎడ్యుకేషనల్ సోసైటీని ఏర్పాటు చేసి కుల మతాలకు కతీతంగా పేద విద్యార్థులకు విద్యను అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.
పేదల అభివృద్ధి కోసం వారు చేస్తున్న కృషి హర్షదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి, అరుణ్ గౌడ్, నవీన్ గౌడ్ తూర్పు శ్రీనివాస్, తెల్లాపూర్ సొసైటీ చైర్మన్ మల్లెపల్లి బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.