ప్రజా సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం

నిజాంపేట మాజీ జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్

రామాయంపేట జనవరి 12 (సిరి న్యూస్) : నిజాంపేట మండలం నస్కల్ రోడ్డు నిర్మాణ పనులకై రిలే నిరాహార దీక్ష రెండవ రోజు కొన‌సాగింది. నిజాంపేట మండల మాజీ జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్ఆదివారం దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావాన్ని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది గడుస్తున్న మెదక్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకో లేదన్నారు. కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించే విషయంలో సాకుగా చెబుతూ రోడ్డు పనుల విషయంలో జాప్యం జరుగుతుందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఆర్ ఆర్ ఆర్ కమిషన్,ఎం.ఆర్ కమిషన్ నడుస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజా పాలన అంటూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల పేరిట కాంట్రాక్టర్లకు ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వమని స్థానిక ఎమ్మెల్యే మాట్లాడడం విడ్డూరంగా ఉందని గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పనిచేసింది మీ తండ్రిగారు కాదా అని గుర్తు చేశారు. వారం రోజుల వ్యవధిలో రోడ్డు పనులు ప్రారంభం కాకపోతే రాంపూర్ నస్కల్ ,నందగోకుల్ ,నగరం గ్రామస్తులతో గడపగడపకు తిరుగుతూ పాదయాత్ర చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చల్మేటి నరేందర్, సిద్ధరామిరెడ్డి,జి పి స్వామి,గరుగుల సుధాకర్, జాల పోచయ్య,అబ్దుల్ పాషా,శంకర్ గౌడ్,బండారి ప్రశాంత్,నరేష్ గౌడ్,సంజీవ్, దుర్గయ్య,ఎల్లం యాదవ్,దేశెట్టి లింగం,నరేష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.