కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాలి

మహిళల కోసం ప్రభుత్వం ప్ర‌త్యేక పథకాలను అమలు చేయాలి
స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంట‌రిగానే పోటీ చేస్తాం
పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి
ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్

సంగారెడ్డి, జనవరి 5 సిరి న్యూస్ : సంగారెడ్డి జిల్లా(Sangareddy District)లో తమ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్ (President Rajeshwar) ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం నాడు సంగారెడ్డిలో కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ జిల్లాలో సంస్థాగత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతున్నందున అక్కడ ఓటర్ లిస్టులను పేర్లను బిజెపి ప్రభుత్వం తొలగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో వార్డులలో తమ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఆయన మహిళలకు పిలుపునిచ్చారు. మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇండ్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు వృద్ధులకు వికలాంగులకు నెలకు 5000 పెన్షన్ పంపిణీ చేయాలి ఆయన సూచించారు.

అనంతరం సంగారెడ్డి పట్టణ మహిళా అధ్యక్షురాలు బొంగుల ఉమారాణి మాట్లాడుతూ మహిళల కోసం ప్రభుత్వం ప్ర‌త్యేక పథకాలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సంగారెడ్డి పట్టణంలో పార్టీ బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. పార్టీలో మేధావులు ప్రజలు మహిళలు పాల్గొనాలని ఆమె సూచించారు. ఈ సమావేశానికి సభాధ్యక్షులు సంగారెడ్డి మహిళా అధ్యక్షురాలు బొంగుల ఉమారాణి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ లక్ష్మి శోభ గీత ప్రమీల చంద్రకళ రమాదేవి నిర్మల రమేష్ శివ ప్రశాంత్ సిద్దు తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు సదాశివపేట, సంగారెడ్డి పట్టణాలకు చెందిన మహిళలు కార్యకర్తలు పార్టీలో చేరారు.