మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం..
గుమ్మడిదల రూరల్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు అయినా నేటి వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని టిఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం గురువారం గుమ్మడిదల మున్సిపల్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ లు రాజశేఖర్, హనుమంత్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వేణు, సంజీవరెడ్డి, మొగులయ్య, వెంకటేష్ గౌడ్, మంద భాస్కర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, పి సంజీవరెడ్డి, ఆంజనేయులు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రాం రెడ్డి, సత్యనారాయణ, వాసుదేవ రెడ్డి, రవీందర్ రెడ్డి, సదానంద రెడ్డి, గోపాల్ మురళి, మహేష్, సుధాకర్ రెడ్డి, భాస్కర్, ఎండి గౌస్, చంద్రారెడ్డి, సత్యనారాయణ, యాదగిరి, సత్తయ్య, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.