విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
రామచంద్రాపురం : నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ కామారతి సమేత బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా జరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు దైవచింతనను పెంపొందించుకోవాలని కోరారు.
నియోజకవర్గం వ్యాప్తంగా పరమత సహనాన్ని పెంపొందిస్తూ ఆలయాలు చర్చిలు మసీదులు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోమిరెడ్డి,. మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఆదర్శ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి, కొమరయ్య, శ్యామ్ రావు, ఉమేష్, శ్రీనివాస్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.