కౌడిపల్లి లో తీన్మార్ మల్లన్న పై ఫిర్యాదు

కౌడిపల్లి ఫిబ్రవరి 06( సిరి న్యూస్) : బిసి బహిరంగ సభలో రెడ్డి సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో మండల రెడ్డి సంఘం సభ్యులు ఏఎస్ఐ శ్రీనివాస్ కు వినతి పత్రం అందించారు. రాజ్యాంగంపై గౌరవం లేకుండా ఓ బాధ్యత గల పదవిలో ఉండి ఇలా కులాల మధ్య చిచ్చు లేపడం తీన్మార్ మల్లన్నకు సరికాదని వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మండల రెడ్డి సంఘం నాయకులు దుర్గారెడ్డి, మహిపాల్ రెడ్డి, మనోహర్ రెడ్డి, గౌ రెడ్డి, వెంకట్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్య రెడ్డి, వీర రెడ్డి ,నందన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.