ఝరాసంగం : మండల పరిధిలోని చిల్లపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబరు 112,125,126,148,103 లో సుమారు 36 ఎకరాలకు సంబంధించి నిమ్జ్ నష్టపరిహారం అసలైన రైతులకు అందలేదని లబ్ధిదారులు మహబూబ్ పాటిల్, శ్రీకాంత్ రెడ్డి, చంద్రయ్య, ఈరన్న, సంగన్న, వెంకటేశం, నరేష్ లు వాపోయారు. సోమవారం ట్రైన్ కలెక్టర్ మనోజ్ కు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ భూములకు సంబంధించిన నిమ్జ్ పరిహారం ఇప్పటివరకు తమకు అందలేదన్నారు నష్టపరిహారం అందేంత వరకు భూముల కబ్జాలో నుంచి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. సరైన రైతులకు గుర్తించకుండా అప్పటి అధికారులు వారి ఇష్టానుసారంగా నష్టపరిహారం అందజేశారన్నారు. అసలైన రైతులకు గుర్తించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.