జర్నలిస్ట్ డైరీని ఆవిష్కరించిన కలెక్టర్ క్రాంతి వల్లూరు

ప్రజాస్వామ్యంలో మీడియా కీలక రంగం

జిల్లా సమాచారంతో డైరీని రూపొందించిన అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలిపిన కలెక్టర్

జనవరి 29 ( సిరి న్యూస్ ) సంగారెడ్డి : ప్రజాస్వామ్యంలో మీడియా రంగం అత్యంత ప్రాధాన్యత కలిగినదని, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం మీడియా అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ 2025 డైరీని కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు, పాలకులకు వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారం అందించడం గొప్ప విషయమని తెలిపారు. టెక్నాలజీకి అనుగుణంగా మీడియా రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని రిపోర్టర్లు పనిచేస్తున్నారని మెచ్చుకున్నారు. సమాజం కోసం నిరంతరం పనిచేస్తున్న విలేకరులు ఆదర్శప్రాయులని కొనియాడారు.

ఈ సందర్భంగా అందరినీ పలకరించి, మీడియా రంగంలో వస్తున్న మార్పులు, సమస్యల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. జర్నలిస్ట్ డైరీలో జిల్లాకు సంబంధించిన జిల్లా జర్నలిస్టు ప్రతినిధుల, ఫోటో జర్నలిస్టు వీడియో జర్నలిస్టుల, జిల్లా అధికారులు, పోలీస్ అధికారుల ఫోన్ నెంబర్ల మంచి సమాచారంతో రూపొందించిన అసోసియేషన్ అధ్యక్షులు ఎం. సాయినాథ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సలహాదారుడు సునీల్, గౌరవ అధ్యక్షులు శంకర్రావు, ఉపాధ్యక్షులు ఎర్ర. వీరేందర్ గౌడ్, రాజ్ కిషోర్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, కోశాధికారి నాగభూషణం, అసోసియేషన్ సభ్యులు, పుండరీకం, లక్ష్మణ్, నర్సింలు, సంగమేశ్వర్, రాజేష్, బక్కప్ప, ప్రవీణ్, అంజిరెడ్డి, సకినాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.