హుగ్గెల్లి లో బసవేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Oplus_16908288

జహీరాబాద్ మే 23 (సిరి న్యూస్): సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించనున్నారు. బసవేశ్వరుని విగ్రహావిష్కరణ ఏర్పాట్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించి, పోలీసులు, ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. క్రౌడ్ కంట్రోలింగ్‌లో జాగ్రత్తగా వ్యవహరించాలని, విగ్రహావిష్కరణ కోసం వస్తున్న అతిథులకు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.