నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ఆవుల రాజీవ్ రెడ్డి..
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు చేసింది..
కొల్చారం: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం నాడు కొల్చారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండల పరిధిలోని 13 గ్రామాలకు చెందిన 34 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 11 లక్షల 88 వేల రూపాయలు చెక్కులను లాంఛనంగా పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీజ్ అమలు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేనని అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతులందరికీ రుణమాఫీ. పెట్టుబడి సాయం త్వరలోనే అమలుచేసి తీరుద్దామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం, సీనియర్ నాయకులు గజిని వెంకట్ గౌడ్, శేఖర్ అక్రమ్ కృష్ణ బాలరాజు మహేశ్వర్ రెడ్డి సయ్యద్ అక్రమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.