హత్నూర: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ విధానం పూర్తిగా కార్మికులకు వ్యతిరేకంగా ఉందని సిఐటియు కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. శనివారం హత్నూర మండలం నస్తీపూర్ శివారులోని లోటస్ పరిశ్రమ ముందు సిఐటియు యూనియన్ కార్మికులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ బడ్జెట్ పేపర్లను తగలబెట్టారు.
ఈ సందర్భంగా యూనియన్ కార్మికులు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో కార్మికులకు మోడీ ప్రభుత్వంలో మరోసారి అన్యాయం జరుగుతుందన్నారు. ప్రకటించిన ఆర్థిక సర్వేలో కార్మిక వ్యతిరేకమైన నిర్ణయాలు, పని గంటల పెంపు విధానాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు యూనియన్ మండల నాయకులు శేఖర్, వీరేశం యాదగిరి ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.