చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలి – జేఏసీ కమిటీ చైర్మన్ వకుళ నరసయ్య

అందుకోసం ఉద్య‌మాన్ని ఉధృతంగా కొన‌సాగిస్తాం
ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి కోమటిరెడ్డి రెడ్డి ఇచ్చిన మాట నెరవేర్చాలి
జేఏసీ చైర్మన్ వకుళ భరణం నరసయ్య పంతులు

చేర్యాల, జ‌న‌వ‌రి 6 సిరి న్యూస్ : చేర్యాల రెవెన్యూ డివిజన్ చేయాలని గత కొంతకాలంగా ఎన్నో పోరాటాలు నిర్వహిస్తున్నామని రెవెన్యూ డివిజన్ అయ్యేంతవరకు తమ ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తామనిచేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ కమిటీ చైర్మన్ వకుళ నరసయ్య అన్నారు. సోమవారం చేర్యాల నుండి సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం వరకు సుమారు 80 వాహనాలలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపి కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా చేర్యాల రెవిన్యూ డివిజన్ కోసం పోరాటాలు నిర్వహిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని వాదించినప్పటికీ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకపోవడం సమంజసం కాదని అన్నారు. గతంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం ధర్నా నిర్వహిస్తున్నప్పుడు ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొని మాట ఇచ్చారని తర్వాత నిండు సభలో ముఖ్యమంత్రి కూడా చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని ఆయన అన్నారు.

ఇరువురు తమ హామీని నిలబెట్టుకోవాలని కోరారు.సిద్దిపేట జిల్లాలో ఉండి రెవెన్యూ డివిజన్ పాత జిల్లాలో ఉండడం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. అన్ని పార్టీల నాయకులతో కలుపుకొని ఐక్య ఉద్యమాలను నిర్వహిస్తున్నామని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకుంటే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.

కార్యక్రమంలో జేఏసీ నాయకులు మున్సిపల్ చైర్మన్ వంగ స్వరూప రాణి,ఆముదాల మల్లారెడ్డి, బి ఆర్ ఎస్ బొంగు రాజేందర్, బాల్ నరసయ్య, యాదగిరి,బీజేపీ బూర్గు సురేష్,టీడీపీ బొగ్గు రాజు,అఖిల పక్ష నాయకులు మంద యాదగిరి, కరుణాకర్, మల్లేశం, కిషన్, సిద్దప్ప,సంతోష్ ఆయా పార్టీలు,ప్రజాసంఘాల నాయకులు, వివిధ యూనియన్స్ అధ్యక్ష కార్యదర్శులు నాయకులు, చేర్యాల పరిధిలోనీ తాజా మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.